పుష్ప'లో మార్పులు.. బన్నీ, సుకుమార్ న్యూ ప్లాన్స్
పుష్ప'లో మార్పులు.. బన్నీ, సుకుమార్ న్యూ ప్లాన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియదు గాని సినిమాకు గురించి వింటుంటే ఇప్పుడే రికార్డుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో మునుపెన్నడు లేని విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శక్తినంతా ధార పోస్తున్నాడట. ఇక సుకుమార్ కూడా బడ్జెట్ విషయంలో లెక్కలేమి పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
ఎలాగైనా మంచి సినిమాతో బాలీవుడ్ లో ఒక హిట్ కొట్టాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. డబ్బింగ్ సినిమాలతో ఇప్పటికే బన్నీకి నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. టీవీలలో అలాగే యూ ట్యూబ్ లలో బన్నీ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో బన్నీ డైరెక్ట్ గా హిందీ బిగ్ స్క్రీన్స్ పై అలరించబోతున్నాడు.
ఆరు నిమిషాల యాక్షన్ సీన్ కోసం ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇటీవల ఒక న్యూస్ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కోసం మరొక మూడు కోట్లు ఖర్చు చేయనున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సరికొత్త మ్యూజిక్ తో ట్యూన్స్ సెట్ చేస్తుండగా సుకుమార్ భారీ సెట్స్ తో మరీంత హైప్ క్రియేట్ చేయనున్నాడట. అడవుల్లో సాగే మూడు నిమిషాల పాట కోసం అల్లు అర్జున్ స్పెషల్ స్టంట్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆడియెన్స్ కి సరికొత్త థ్రిల్ ఇవ్వనున్నాయట. మొత్తంగా సుకుమార్ రూరల్ డ్రామాతోనే తన అసలైన టాలెంట్ ని ఇండియాకు పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతగా హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ చిత్రం కోసం ఓ మాస్ మసాల సాంగ్‌ని ప్లాన్ చేశారు. ఇందులో బాలీవుడ్ హాటీ ఊర్వశీ రౌతేలా నటించనుందని ఇప్పటికే ప్రచారం మొదలైంది. ఈ పాట జానపద శౌలిలో సాగుతుందని, సినిమాకు ఈ పాట ఓ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ పాట కోసం దేవిశ్రీ
ప్రసాద్ అదిరిపోయే ట్యూన్‌ని సిద్ధం చేశారట. మాస్ ఆడియన్స్‌ని ఈ పాట ఓ ఊపు ఊపడం ఖాయమని తెలుస్తోంది.
బన్నీ మాసీవ్ లుక్ కోసం కాస్ట్యూమ్స్‌ని కాఫీలో రెండు రోజులు నానబెట్టి మరీ ఆ తరువాత క్లీన్ చేసి వాడుతున్నారట. దీంతో కాస్ట్యూమ్స్‌కి ఓల్డ్ లుక్ వచ్చేస్తోందట. ఈ ట్రిక్ ఏదో బాగుందని అన్ని కాస్ట్యూమ్స్‌కి ఇదే ఫార్ములాని వాడుతున్నారట. ఈ చిత్రం నుంచి తమిళ హీరో విజయ్ సేతుపతి తప్పుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. కానీ టీమ్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో నటిస్తున్నాడనే అంతా అంటున్నారు. ఇక ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, హరీష్ ఉత్తమన్, అనసూయ, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు.
Comments
Post a Comment