ఎన్టీఆర్‌కు ఆర్ఆర్ఆర్ movie బర్త్‌డే గిఫ్ట్ రెడీ
ఎన్ఠీఆర్ పుట్టిన రోజు ఈ నెల 20న జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజున `ఆర్ ఆర్ ఆర్` టీజర్ రూపంలో ఫ్యాన్స్‌కి గిఫ్ట్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత దినయ్య కూడా ఎన్టీఆర్ గిఫ్ట్ రెడీ అవుతోందంటూ వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ అంబరాన్నంటే సంబరాలకు పిద్ధమవుతున్న వేళ `ఆర్ఆర్ఆర్` టీమ్ నుంచి షాక్ లాంటి వార్త బయటికొచ్చింది.
`లాక్‌డౌన్ సమయాన్ని మళ్లీ పొడిగించడంతో అనుకున్న పని ఆపేయాల్సి వచ్చింది. మా వంతు ప్రయత్నం చేసినప్పటికీ అనుకున్న పనిని మాత్రం పూర్తి చేయలేకపోయాం. ఎన్టీఆర్ బర్త్‌డే ట్రీట్‌ని సిద్ధం చేయలేకపోయాం. ఈ కారణంగాను ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేయలేకపోతున్నాం` అని ట్విట్టర్ వేదికగా వెల్లడించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు
ఏదో ఒకటి రిలీజ్ చేయాలనుకోవడం లేదు. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే త్వరలోనే విడుదల చేస్తాం. అది మనకు ఓ పెద్ద పండగ అవుతుందని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నాం` అని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ టీజర్‌కు కావాల్సిన ఫుటేజ్ లేదంటూ రాజమౌళి వెల్లడిస్తూ వస్తున్నారు. తాజా ప్రకటనతో రాజమౌళి ఎందుకు అలా చెప్పారో క్లారిటీ వచ్చింది.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే హంగామా ఇప్పటికే మొదలైంది. ఈ నెల పుట్టిన రోజు. ఫ్యాన్స్ కామన్ డీపీలతో సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. పుట్టిన రోజు వేడుకలు మరో ఆరు రోజులే వుండటంతో హంగామా తారా స్థాయికి చేరుతోంది. ఈ పుట్టిన రోజున మూడు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దిగ్రేట్ డైరెక్టర్ రాజమౌళి `బాహుబలి` తరువాత చేస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొరంభీంగా కనిపించబోతున్నారు. ఇటీవల రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు లుక్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ని రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. వీడియోలో రామ్‌చరణ్ కి ఎంత అప్లాజ్ వచ్చిందో.. ఈ వీడియోకు వాయిస్ ఓవర్ అందించిన ఎన్టీఆర్‌పై ఆ స్థాయిలోనే ప్రశంసలు కురిశాయి.
ఇప్పుడు ఎన్టీఆర్ టర్న్. ఎన్టీఆర్ వీడియోని ఈ పుట్టిన రోజున రిలీజ్ చేయాలి కానీ అందుకు తగినంత ఫుటేజ్ లేదని రాజమౌళి ఇటీవల వెల్లడించడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ వీడియోని ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ చిత్రంలో పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సన్నివేశం రోమాంచితంగా వుంటుందట. ఈ సీన్ చూస్తే ఫ్యాన్స్ కేకలే అంటున్నారు. ఆ సన్నివేశంలోని కొన్ని సీన్స్‌తో ఫస్ట్‌లుక్ టీజర్‌ని రిలీజ్ చేస్తారా? లేక ఏ టీజర్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి జక్కన్న ట్రీట్ ఇవ్వబోతున్నారన్నది తెలియాలంటే ఈ నెల 20 వరకు వేచి చూడాల్సిందే
కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం కత్తి పట్టకుండా, గన్ను పేల్చకుండా నిర్భంద యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో లాక్ డౌన్ విధించడంతో అంతా ఇంటికే పరిమితమైపోయారు. ఈ విపత్కర సమయంలో కొంత మంది లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది ఇష్టమైన పనుల్లో బిజీ అయిపోయారు. .
ఒక్కో సెలబ్రిటీ ఒక్కో వ్యాపకంతో బిజీగా క్వారెంటైన్ టైమ్‌ని గడిపేస్తుంటే జక్కన్న మాత్రం ఎన్టీఆర్ కోసం సప్‌ప్రైజ్‌ని రెడీ చేస్తున్నారట. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల కలయికలో రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం దానయ్య అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 8న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన జక్కన్న మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా కొమరం భీం పాత్రకు సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నాడట. ఎన్టీఆర్ లుక్ కొమరం భీంగా ఎలా వుండబోతోంది.
Comments
Post a Comment