పవన్ ఆ సినిమాను చేయట్లేదట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. రీ ఎంట్రీలో వరసగా సినిమాలను సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు పవన్. తన కెరీర్ లో ఎప్పుడూ ఒక సినిమా పూర్తయ్యాకనే మరో సినిమాను ఒప్పుకునే పవన్. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలను ఒప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రిమేక్ గా వకీల్ సాబ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. మరో 15 రోజులు షూటింగ్ పూర్తి చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లిపోవచ్చు. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనా కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే సాధ్యమైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ను ప్రకటించిన దగ్గరనుండి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపించింది. ఈ సినిమా పింక్ చిత్రానికి రీమేక్ అయినా కానీ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఇందులో పుష్కలంగా ఉండనున్నాయన్న సంకేతాలు అందడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. దానికి తోడు విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఆ తర్వాత వచ్చిన మగువా సాంగ్ వకీల్ సాబ్ అంచనాలను తారాస్థాయిలో నిలిపాయి. అన్నీ అనుకున్నట్లుగా సజావుగా జరిగి ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదల కూడా అయిపోయేది. వకీల్ సాబ్ ను మే 15న విడుదల చేయాలనీ భావించారు.
హిందీ హిట్ చిత్రం `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీకపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో లావణ్య త్రిపాఠి, నివేదా థామస్, అంజలి, ప్రకాష్‌రాజు నటిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే మే 15న సరిగ్గా ఈ రోజే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ విధి మరోలా ప్లాన్ చేసింది.
దీంతో నిరుత్సాహానికి గురైన ఫ్యాన్స్ `వకీల్‌సాబ్` రిలీజ్ ప్లాన్ చేసిన ఈ రోజున సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. ఈ రోజు ఉదయం నుంచి పవన్ ఫ్యాన్స్ మీమ్స్‌తో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. పలు హిట్ చిత్రాల్లోని డైలాగ్‌లని ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సందర్భానికి, వారు పడుతున్న బాధకు అన్వయించుకుని పోస్ట్ చేస్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి
వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది. షూటింగ్ కు అనుమతి లభించిన వెంటనే వీలైనంత తొందర్లో మిగతా బ్యాలన్స్ పార్ట్ షూటింగ్ ను కొనసాగించాలని భావిస్తున్నారు. ఇంకా కోర్టు సీన్స్ బ్యాలన్స్ ఉండడంతో ముందుగా ఒక స్పెషల్ సెట్ వేసి దాన్ని పూర్తి చేస్తారు. ఇక ఈ సినిమాలో పవన్ ఎంట్రీ ఒక స్టైలిష్ ఫైట్ తో ఉంటుందని తెలుస్తోంది. అది కచ్చితంగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. మరి ఈ రేంజ్ లో అంచనాలు ఉంటే పవర్ స్టార్ వాటిని వకీల్ సాబ్ తో అందుకోగలడా.
ఈ సినిమా రిలీజ్‌ని వాయిదా పడేలా చేసింది.త్రానికి దిల్ రాజు నిర్మాత. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు
Comments
Post a Comment